ETV Bharat / state

గ్రామాల్లో నీటి సమస్యలు.. చలించిన విదేశీయులు

ఓవైపు మండే ఎండ. మరోవైపు ఉక్కపోత. ఇంకోవైపు నీటిఎద్దడి. ఎండాకాలం వచ్చిందంటే ఆ ప్రాంత ప్రజలు అల్లాడిపోవాల్సిందే. తాగునీరు కోసం మైళ్ల దూరం నడవాల్సిందే. ప్రభుత్వాలు మారినా వారి తలరాతలు మాత్రం మారడం లేదు.

author img

By

Published : Jun 1, 2019, 7:35 PM IST

వారి సమస్యలు చూసి విదేశీయులే చలించిపోయారు
వారి సమస్యలు చూసి విదేశీయులే చలించిపోయారు

తూర్పుగోదావరి జిల్లా ప్రతిపాడు మండలంలోని చాలా గ్రామాల ప్రజలు తాగునీరు కోసం అష్టకష్టాలు పడుతున్నారు. వేసవి వచ్చిందంటే చాలు భూగర్భజలాలు ఇంకిపోవడం.. చేతిపంపులు మొరాయించడం.. బావులు ఎండిపోవడం.. కుళాయిలు రాకపోవటం.. విద్యుత్ అంతరాయం ఇలా అనేక రూపాలలో ఆ ప్రాంత ప్రజలు తీవ్ర నీటిఎద్దడిని ఎదుర్కొంటున్నారు. మండలంలోని ఉపప్రణాళిక ప్రాంతంలో పరిస్థితి మరీ దారుణం. ఈ ప్రాంతంలోని కొండపల్లి, బురదకోట, బాపన్నదొర, కే. మిర్తివాడ తండాలలో మంచినీరు కావాలంటే కిలోమీటర్ల దూరం వెళ్లాల్సిందే. కొంతమంది అంతదూరం వెళ్లలేక వాగులలో నీటిని తాగుతున్నారు.

మండలంలోని ఒమ్మంగి, ధర్మవరం, శరభవరం, గజ్జనాపూడి, ప్రతిపాడు గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం స్పందించి ఇప్పటికైనా తమ తాగునీటి ఇక్కట్లు తీర్చాలని వారు కోరారు. ఇటీవల ఈ తండాలలో టెక్సాస్​కు చెందిన ఇద్దరు అమెరికన్లు పర్యటించారు. అక్కడి పరిస్థితి చూసి చలించి.. గ్రామస్థుల సమస్య పరిష్కరించాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించారు.

ఇవీ చదవండి..

జలాశయంలో పడి ముగ్గురు మృతి

Intro:కిట్ నం:879,విశాఖ సిటీ, ఎం.డి. అబ్దుల్లా.

( ) గోదావరి నదిపై గత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన నదుల అనుసంధాన ఎత్తిపోతల పథకాలను నిలిపివేయాలని జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశించిందని మాజీ మంత్రి వట్టి వసంత కుమార్ తెలిపారు. విశాఖ వీ జే ఎఫ్ ప్రెస్క్లబ్లో గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాల వివరాలను మీడియాకు తెలియజేశారు.

Body:ఈ ఎత్తిపోతల పథకాలపై తాను దాఖలు చేసిన పిటిషన్పై ఈ ప్రతి స్పందన వచ్చిందని అన్నారు. ఈ ప్రాజెక్టులపై విచారణ కోసం గ్రీన్ ట్రిబ్యునల్ నియమించిన కమిటీ నెల రోజులలో నివేదిక రూపొందించి సమర్పించాలని ఆదేశించింది అన్నారు. నదుల అనుసంధానం పేరుతో చేపట్టిన ఈ ప్రాజెక్టులను ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు లేవని అన్నారు.

Conclusion:డెల్టా ప్రాంత రైతుగా తాను న్యాయస్థానాన్ని ఆశ్రయించానని అన్నారు. ఈ ప్రాజెక్టులపై తాను 2015 సంవత్సరం నుంచి పోరాడుతున్నాం అన్నారు.

బైట్: వట్టి వసంతకుమార్,మాజీమంత్రి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.