తూర్పుగోదావరి జిల్లాలోని సర్ ఆర్థర్ కాటన్ (ధవళేశ్వరం) బ్యారేజీ నుంచి గోదావరి డెల్టాకు నీటిని విడుదల చేశారు. జలవనరుల శాఖ అధికారులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి తూర్పు, పశ్చిమ, మధ్య డెల్టా కాల్వలకు 3 వేల క్యూసెక్కుల నీళ్లు వదిలారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ పాల్గొన్నారు. పోలవరం ప్రాజెక్ట్ అప్రోచ్ ఛానల్ ద్వారా నీరు మళ్లించి డెల్టాకు విడుదల చేయడం గొప్ప విషయమని అన్నారు. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్ట్ నుంచి 15 వేల క్యూసెక్కుల నీరు కాటన్ బ్యారేజీకి చేరుతోందని సీఈ పుల్లారావు తెలిపారు.
ఇదీ చదవండి:
Endowment Tenders Abolish: ఆలయ భూముల వేలం టెండర్ ఆదేశాలను రద్దు చేసిన హైకోర్టు