ETV Bharat / state

రాజానగరంలో వీఆర్వోలకు శిక్షణ కార్యక్రమం

గ్రామ, వార్డు సచివాలయాల సేవలు ప్రజలకు చేరువవుతున్నాయని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌ డి.మురళీధర్‌ రెడ్డి అన్నారు. జిల్లాలోని వీఆర్వో శిక్షణా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నిబద్ధతో పని చేయాలని వారికి సూచించారు.

vro training at rajanagaram
రాష్ట్రంలోనే మొదటిసారిగా రాజానగరంలో వీఆర్వోలకు శిక్షణ కార్యక్రమం
author img

By

Published : Sep 22, 2020, 11:19 PM IST

తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలోని తహసీల్దార్‌ కార్యాలయంలో వీఆర్వోల శిక్షణా కార్యక్రమంలో సబ్‌ కలెక్టర్‌ అనుపమ అంజలితో కలిసి కలెక్టర్‌ డి.మురళీధర్ పాల్గొన్నారు‌. నూతన బాధ్యతలు తీసుకున్న వీఆర్వోలు ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు దృష్టి సారించాలని అన్నారు. రాష్ట్రంలో ఏ జిల్లాలోనూ వీఆర్వోలకు శిక్షణ కార్యక్రమం ప్రారంభం కాలేదని... మన జిల్లాలో ఈ డివిజన్‌లో శిక్షణ పూర్తి చేసుకోవడం అభినందనీయమని అన్నారు. ప్రత్యేక దృష్టి సారించిన సబ్‌ కలెక్టర్‌ను ఆయన అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు నాణ్యమైన సేవలు అందుతున్నాయని అన్నారు. జిల్లాలో పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టిందని...ప్రస్తుతానికి 16 శాతం తగ్గిందన్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో కొవిడ్‌ సెంటర్లను రద్దు చేస్తున్నామని తెలిపారు. మందుల కొరత సమస్య లేదని, హోమ్‌ ఐసోలేషన్​లో ఉన్న వారి కోసమే లక్ష కిట్లు సిద్ధం చేసి ఉంచామని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ జి.బాలసుబ్రహ్మణ్యం, ఎంపీడీఓ ఎన్‌వీవీఎస్‌ మూర్తి, సీడీపీఓ నాగమణి, తదితరులు పాల్గొన్నారు.

జిల్లాలోని ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని అయినాపురం, కాట్రేనికోన మండలంలోని చెయ్యేరు గ్రామ సచివాలయాలను జిల్లా జాయింట్ కలెక్టర్ కీర్తి చేకూరి పరిశీలించారు. కార్యాలయం ద్వారా ప్రజలకు అందిస్తున్న సేవలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఉద్యోగులంతా జవాబుదారీతనంగా పని చేయాలని.. ప్రజల సమస్యల పరిష్కారానికి తక్షణం స్పందించాలని సిబ్బందికి సూచించారు.

ఇదీ చూడండి.

హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఉపకులపతి పదవీకాలం పొడిగింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.