మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్ట్ కు నిరసనగా తూర్పుగోదావరి జిల్లా కొమరిపాలెంలో తెదేపా నేతలు నిరసన కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఒక వాలంటీర్ మద్యం సేవించి చరవాణితో కార్యక్రమాన్ని చిత్రీకరించడంపై అనపర్తి మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. విధి నిర్వహణ సమయంలో మద్యం సేవించి ఉన్న వాలంటీర్ ను విధుల నుంచి సస్పెండ్ చేయాలని నినాదాలు చేశారు. ప్రభుత్వ ఉన్నతాధికారులతో మాట్లాడి విధి నిర్వహణ సమయంలో మద్యం సేవించి ఉన్న వాలంటీర్ ని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
ఇది చదవండి వాడపల్లి వెంకటేశ్వరస్వామి దర్శనానికి అనుమతి నిరాకణ