చౌక దుకాణాల ద్వారా పంపిణీ చేస్తున్న నిత్యావసరాల కోసం ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం, నరేంద్రపురం గ్రామాల్లో అర్ధరాత్రి 2 గంటల నుంచే డిపోల వద్ద బారులు తీరుతున్నారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు మాత్రమే రేషన్ సరుకులు పంపిణీ చేస్తున్నారు. అందునా సాంకేతిక సమస్యల కారణంగా బయోమెట్రిక్ మిషన్లు పని చేయకపోవటంతో సరుకులు పంపిణీ ఆలస్యం అవుతోంది. అందువల్లే ప్రజలు అర్ధరాత్రి నుంచే డిపోల వద్ద నిరీక్షిస్తున్నారు. వాలంటీర్ల ద్వారా పంపిణీ చేస్తామని చెప్పినా ఆ పద్ధతి అమలు కావటం లేదని గ్రామస్తులు వాపోతున్నారు.
ఇదీ చదవండి: 'ఆందోళన వద్దు... అందరికీ రేషన్ ఇస్తాం'