తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం రామవరంలో తెదేపా గ్రామ శాఖ ఆధ్వర్యంలో.. మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గ్రామస్థులకు కూరగాయలు పంపిణీ చేశారు. ఒక్కొక్క కుటుంబానికి 3.5 కిలోల చొప్పున సుమారు 2000 కుటుంబాలకు కూరగాయలు అందజేశారు. కొవిడ్-19 తీవ్రంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో లాక్డౌన్ అమల్లో ఉన్న కారణంగా నిత్యావసరాలకు ఇబ్బందులు పడుతున్న ప్రజలకు సాయపడాలన్న తెదేపా అధినేత చంద్రబాబునాయుడు పిలుపు మేరకు.. కూరగాయలు పంపిణీ చేస్తున్నట్టు ఆయన తెలిపారు.
ఇవీ చదవండి.. అన్న క్యాంటీన్లు తెరవాలి: ప్రభాకర్ చౌదరి