లాక్‌డౌన్‌తో తీవ్ర ఇబ్బందులు పడుతున్న పేద కుటుంబాలకు రూ.5 వేలు ఇవ్వాలన్న డిమాండ్‌తో అనంతపురం మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి 12 గంటల నిరాహార దీక్ష చేపట్టారు. నగరంలోని ఆయన స్వగృహంలో ఇవాళ ఉదయం దీక్షకు దిగారు. మాజీ ఎమ్మెల్యేతో పాటు పలువురు తెదేపా నాయకులు దీక్షలో పాల్గొన్నారు. లాక్డౌన్ కారణంగా ప్రజలు కష్టాల్లో ఉన్నారని.. వారికి ప్రభుత్వం ఇచ్చే వెయ్యి రూపాయలు ఏమాత్రం సరిపోవని చెప్పారు. పేదలకు నగదు పంపిణీలో కొందరు వైకాపా నాయకులు పాల్గొంటూ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. మూసివేసిన అన్న క్యాంటీన్లు తెరిచి పేదల ఆకలి తీర్చాలని సూచించారు.
ఇదీ చదవండి: