తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో గురువారం బాలికపై 60 ఏళ్ల వృద్ధుడు అఘాయిత్యానికి పాల్పడిన ఘటనపై తెదేపా నాయకులు నాయకులు స్పందించారు. అనపర్తి ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్న బాలికను తెదేపా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత, మాజీమంత్రి జవహర్, అనపర్తి మాజీఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తోపాటు మహిళా నాయకులు సుంకర పావని, పిచ్చెటి విజయలక్ష్మి, మాలే విజయలక్ష్మి పరామర్శించారు.
తెదేపా రాష్ట్ర మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత మాట్లాడుతూ... వైకాపా అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో రోజుకు ఒక సంఘటన జరుగుతుందని ఆరోపించారు. దిశ చట్టం పెట్టి సంవత్సరం అయినా... ఆ చట్టానికి దిశదశ లేదన్నారు. దిశ పోలీసు స్టేషన్ ప్రారంభోత్సవంలో పోటీపడి రిబ్బన్లు కట్ చేసిన మహిళా నాయకులు... మహిళలను రక్షించడంలో ఆ శ్రద్ధ చూపించాలని హితవు పలికారు.
ఇదీ చగవండీ... సీఎం జగన్ కేసుల విచారణ ఈ నెల 12కి వాయిదా