తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో స్వామివారి ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గజ స్తంభం వద్ద వేద పండితులు ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించారు .అనంతరం స్వామి వారిని పరవాసుదేవ అలంకరణ చేసి శేష వాహనంపై ఊరేగించారు. కనుల పండువగా సాగిన ఈ వేడుకలో భక్తులు పాల్గొని స్వామి వారి తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు.
ఇదీ చదవండీ...శ్రీ వారి మెట్ల మార్గం తిరిగి ప్రారంభం