తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లిలో వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. బుధవారం నుంచి ఈనెల 12వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. స్వామి అమ్మవార్ల విగ్రహాలను వేదపండితులు డప్పు వాయిద్యాల నడుమ ఊరేగింపుగా ఆలయ ప్రాంగణంలోకి తీసుకువచ్చారు. ప్రత్యేక మండపంలో స్వామి అమ్మవారి ఉత్సవ విగ్రహాలను ఉంచి వార్షిక బ్రహ్మోత్సవాలను వేదపండితులు ప్రారంభించారు. ఆలయ కమిటీ చైర్మన్ రమేష్ రాజు దంపతులు, ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రతి రోజు నిర్వహించే స్వామివారి వాహన సేవలను ఆలయ ప్రాంగణంలో మాత్రమే నిర్వహించేలా దేవాదాయ శాఖ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
ఇవీ చదవండి