కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం... బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. రేపటి నుంచి నుంచి 25 వరకు ఉత్సవాలు జరగనున్నాయి. విశ్వక్సేన పూజ, అంకురార్పణ నవమూర్తి ఆవాహన, ధ్వజారోహణ పూజలు నిర్వహించి ఉత్సవాలను ప్రారంభిస్తారు. 18న సరస్వతి అలంకరణలో హంస వాహనంపై... 19న కోదండరామ అలంకరణలో హనుమత్ వాహహనంపై... 20న యోగానారసింహ అలంకరణలో సింహ వాహనంపై ... 21న మలయప్ప అలంకరణలో గరుడవాహనంపై... 22న శ్రీకృష్ణ అలంకరణలో సూర్యప్రభ వాహనంపై... మోహిని అలంకరణలో చంద్రప్రభ వాహనంపై... 23న రాజాధిరాజ అలంకరణలో గజ వాహనంపై... 24న కల్కి అలంకరణలో అశ్వ వాహనంపై స్వామివారిని ఊరేగిస్తారు. 25న మహా పూర్ణాహుతి, నీరాజనం, మంత్రపుష్పం నిర్వహించి బ్రహ్మోత్సవాలను ముగిస్తారు.
వాడపల్లి వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం - వాడపల్లి వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు
తూర్పు గోదావరి జిల్లా వాడపల్లి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. సుందరంగా ఆలయాన్ని ముస్తాబుచేశారు. ఈ నెల 17 నుంచి 25వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి.
కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం... బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. రేపటి నుంచి నుంచి 25 వరకు ఉత్సవాలు జరగనున్నాయి. విశ్వక్సేన పూజ, అంకురార్పణ నవమూర్తి ఆవాహన, ధ్వజారోహణ పూజలు నిర్వహించి ఉత్సవాలను ప్రారంభిస్తారు. 18న సరస్వతి అలంకరణలో హంస వాహనంపై... 19న కోదండరామ అలంకరణలో హనుమత్ వాహహనంపై... 20న యోగానారసింహ అలంకరణలో సింహ వాహనంపై ... 21న మలయప్ప అలంకరణలో గరుడవాహనంపై... 22న శ్రీకృష్ణ అలంకరణలో సూర్యప్రభ వాహనంపై... మోహిని అలంకరణలో చంద్రప్రభ వాహనంపై... 23న రాజాధిరాజ అలంకరణలో గజ వాహనంపై... 24న కల్కి అలంకరణలో అశ్వ వాహనంపై స్వామివారిని ఊరేగిస్తారు. 25న మహా పూర్ణాహుతి, నీరాజనం, మంత్రపుష్పం నిర్వహించి బ్రహ్మోత్సవాలను ముగిస్తారు.
తూర్పు గోదావరి జిల్లా
కంట్రిబ్యూటర్:కనికిరెడ్డి
కొత్తపేట
కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 17 నుంచి 25వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరగనున్నాయి.
Body:బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయం ప్రాంగణం మొత్తం చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. హోమాలు నిర్వహించేందుకు యాగశాలను సైతం ఏర్పాటు చేశారు రాత్రి సమయంలో విద్యుత్ కాంతులు విరజిమ్మేలా ఆలయ పరిసర ప్రాంతాలన్నీ విద్యుత్ లైటింగ్ను ఏర్పాటు చేశారు.
తిరుమలలో బ్రహ్మోత్సవాలను ఏ విధంగా నిర్వహిస్తారో అదే రీతిలో స్వామివారికి కి ప్రతి రోజు ఉదయం పూజలు నిర్వహించి రాత్రి వాహన సేవను నిర్వహించనున్నారు.
బైట్ : ఆలయ ప్రధాన అర్చకులు
Conclusion:ఏడు శనివారం వెంకన్న దర్శనం ఏడేడు జన్మల పుణ్య ఫలం అని భక్తులు నమ్మకంతో 7 శని వారం నోము నోచుకునేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి ప్రతి వారం సుమారు 50 వేల మంది ఈ ఆలయానికి వస్తుంటారు బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారి దర్శనానికి వేల సంఖ్యలో భక్తులు రానున్న నేపథ్యంలో దేవాదాయ అన్ని చర్యలు తీసుకుంటుంది.
బైట్: ముదునూరు సత్యనారాయణ రాజు ఈవో
17వ తేదీ విశ్వక్సేన పూజ, అంకురార్పణ నవ మూర్తి ఆవాహన, ధ్వజారోహణ పూజలు నిర్వహించి బ్రహ్మోత్సవాలను ప్రారంభిస్తారు రాత్రి స్వామి వారిని పరావాసుదేవ అలంకరణ చేసి శేష వాహనంపై ఊరేగిస్తారు.
18వ తేదీన మహిళలతో సామూహిక లక్ష కుంకుమార్చన నిర్వహించి సరస్వతి అలంకరణలో హంస వాహనంపై ఊరేగిస్తారు.
19వ తేదీన మహా పుష్పయాగం సహస్ర దీపాలంకరణ సేవ నిర్వహించి కోదండరామ అలంకరణలో హనుమద్వాహనంపై ఊరేగి స్తారు
20వ తేదీన శ్రీనివాస కళ్యాణం నిర్వహించి యోగ నర సింహ అలంకరణ చేసి సింహ వాహనంపై ఊరేగిస్తారు
21 న మహా సుదర్శన హోమం నిర్వహించి మలయప్ప అలంకరణలో గరుడవాహన సేవను నిర్వహిస్తారు
22న శ్రీకృష్ణ అలంకరణలో సూర్యప్రభ వాహనం మోహిని అలంకరణలో చంద్రప్రభ వాహన సేవ నిర్వహిస్తారు
23న లక్ష్మీ వెంకటేశ్వర మూల మంత్ర పూర్వక వెంకటేశ్వర హోమం నిర్వహించి రాజాధి రాజ అలంకరణలో గజ వాహనంపై ఊరేగిస్తారు
24న తిరుప్పావడ సేవ నిర్వహించి కల్కి అలంకరణలో అశ్వ వాహనంపై ఊరేగుతారు
25 న మహా పూర్ణాహుతి నీరాజనం మంత్రపుష్పం తదితర పూజలు నిర్వహించి బ్రహ్మోత్సవాలను ముగిస్తారు