Bank Officer Cheated With Fake Gold In East Godavari: ప్రస్తుత కాలంలో డబ్బులు అవసరమైతే బ్యాంకు వైపు కాలు కదుపుతారు. తమ వద్ద ఉన్న ఆస్తులను కానీ బంగారాన్ని తాకట్టు పెట్టి కావలసిన డబ్బు తెచ్చుకుంటారు. కానీ ఆ బ్యాంకు అధికారి చేసిన పనికి బ్యాంకుల వైపు చూడాలంటే భయపడుతున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో గోల్డ్ అప్రైజర్ చేసిన మోసానికి అందరూ ఆశ్యర్యం వ్యక్తం చేస్తున్నారు. తనకు తెలిసిన వారి దగ్గర నుంచి నకిలీ బంగారం తీసుకోని లోన్ ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
తూర్పు గోదావరి జిల్లా కాకినాడ యూకో బ్యాంకులో గోల్డ్ అప్రైజర్ తాడోజు శ్రీనివాసరావు గత కొంతకాలంగా నమ్మకంగా విధులు నిర్వహిస్తున్నాడు. ఆ నమ్మకాన్ని అవకాశం తీసుకున్న తాడోజు శ్రీనివాసరావు కాకినాడ యూకో బ్యాంకులో నకిలీ బంగారు తనఖా పెట్టి 2 కోట్ల 45 లక్షలకు పైగా రుణం కాజేశాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
కాకినాడ యూకో బ్యాంకులో నకిలీ బంగారు తనఖా పెట్టి 2 కోట్ల 45 లక్షలకు పైగా రుణం కాజేసిన కేసులో ప్రధాన నిందితుడు గోల్డ్ అప్రైజర్ తాడోజు శ్రీనివాసరావుని పోలీసులు అరెస్ట్ చేశారు. 60 ఖాతాల్లో 30 మంది ఖాతాదారుల పేరిట నకిలీ బంగారం తాకట్టు పెట్టి ఈ మోసానికి పాల్పడ్డారు. ఇతనికి మరో ఇద్దరు సహకరించారు. ఒకతను ఫెడరల్ బ్యాంకులో గోల్డ్ అప్రైజర్‌గా పని చేస్తున్నాడు. వారిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచడం జరిగింది. ఈ వ్యవహారంలో 30 మంది ఖాతాదారులను, బ్యాంకు సిబ్బంది పాత్రపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు, వారి పాత్ర ఉంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామనీ కాకినాడ ఏఎస్పీ శ్రీనివాసరావు చెప్పారు. ఈ కేసు వివరాలను మీడియాకు వివరించారు.
విషయం తెలుసుకున్న ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు. పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బ్యాంకులో బంగారాన్ని లోన్‌గా ఉంచడానికి ఆలోచిస్తున్నారు.
ఇవీ చదవండి