కాకినాడ జేఎన్టీయూకు చెందిన ఇద్దరు ప్రొఫెసర్లు ఏపీ సైంటిస్టు అవార్డు-2020కు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ బాలకృష్ణ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ రంగాల్లో చేసిన పరిశోధనలకు గాను.. 23 మందికి సైంటిస్టు అవార్డులను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నట్లు వివరించారు. సైన్స్ అండ్ టెక్నాలజీలో చేసిన పరిశోధనలకు గాను మెకానికల్ ఇంజినీరింగ్ విభాగంలో ప్రొఫెసర్ డి. లింగరాజుకు, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగంలో ప్రొఫెసర్ ఎస్.శివ నాగరాజుకు.. ఈ పురస్కారాలు దక్కినట్లు వెల్లడించారు.
ఈ నెల 22న విజయవాడలో జరగనున్న రాష్ట్ర కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సమావేశంలో.. వీరిరువురికీ అవార్డులు అందిస్తారని ప్రిన్సిపాల్ చెప్పారు. ఆయా విభాగాధిపతులు శ్రీ కుమార్, మీరా సాహెబ్, తదితరులు ఇద్దరిని అభినందించారు.
ఇదీ చదవండి: