ETV Bharat / state

పందలపాడులో 2 కరోనా కేసులు.. అప్రమత్తమైన అధికారులు - అమలాపురంలో కరోనా కేసులు తాజా వార్తలు

అమలాపురం మండలం బండారులంక శివారు పందలపాడు ప్రాంతంలో ఇద్దరికి కరోనా సోకింది. అధికారులు ఆ ప్రాంతాన్ని రెడ్​జోన్​గా ప్రకటించారు. ప్రజలు బయట తిరగకుండా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.

two corona positive cases at amalapuram
పందలపాడులో రెండు కారోనా కేసులు అప్రమత్తమైన అధికారులు
author img

By

Published : May 17, 2020, 3:27 PM IST

తూర్పు గోదావరి జిల్లా అమలాపురం మండలం బండారులంక శివారు పందలపాడు ప్రాంతంలో.. ఇద్దరికి కరోనా సోకింది. వారి నివాస ప్రాంతాన్ని రెడ్ జోన్ గా ప్రకటించిన అధికారులు.. ప్రజలు బయట తిరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకున్నారు. కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.

ఈ ప్రాంతంలో 800 మందికి కరోనా వైద్య పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా 300 మందికి మాత్రమే పరీక్షలు చేశామని డాక్టర్ సిహెచ్. పుష్కర రావు తెలిపారు. వైద్య పరీక్షలు నిర్వహించిన వారికి కరోనా నెగిటివ్ వచ్చిందని వెల్లడించారు. మిగిలిన వారికి కూడా పరీక్షలు పూర్తి చేస్తామన్నారు.

అమలాపురం ఆర్టీవో బి హెచ్ భవాని శంకర్, డీఎస్పీ షేక్​ బాషా ఆ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి పెట్టి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

ఇవీ చూడండి:

'తునిలో ఈ నెల 28 వరకు లాక్​డౌన్'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.