భారీ వర్షాలకు ఆంధ్రా - ఒడిశా సరిహద్దులోని పిల్లిగెడ్డ వంతెనకు వరద పోటెత్తింది. అంతర్రాష్ట్ర రహదారిపై ఉన్న ఈ వంతెన పై నుంచి రెండు అడుగులు మేరకు నీరు ప్రవహించింది. వరద ధాటికి వంతెనకు ఇరువైపుల ఉన్న రక్షణ గోడలు కొట్టుకుపోయాయి. తూర్పు కనుమలలో ఆంధ్రా మీదుగా ఒడిశాకు రాకపోకలు నిలిచిపోయాయి.
గడిచిన 24 గంటల్లో ఈ ప్రాంతంలో 20 సెంటిమీటర్లు వర్షపాతం నమోదైంది. పిల్లిగెడ్డ నుంచి జలాశయానికి భారీగా వరద వస్తుండటంతో ఏపీ జెన్‌కో అధికారులు అప్రమత్తమయ్యారు. జెన్‌కో ఈఈ జకీర్ హుస్సేన్, డీఈఈ అప్పలనాయుడు పిల్లిగెడ్డ వంతెనను పరిశీలించారు. వరద ఉద్ధృతి తగ్గిన వెంటనే వంతెన తూముల్లో చిక్కుకుపోయిన చెత్తను తొలగించకపోతే వంతెనకు ముప్పు వాటిల్లే అవకాశముందని అధికారులు అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి