ట్రాఫిక్ నిబంధనలపై పూర్తి అవగాహన కల్పించడమే తమ లక్ష్యమని, వాహనదారులకు జరిమానాలు విధించడం మా ఉద్దేశం కాదని రాజమహేంద్రవరం ట్రాఫిక్ డీఎస్పీ వెంకట్రావు అన్నారు. నూతనంగా రాజమహేంద్రవరం డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన ఆయన మీడియాతో మాట్లాడారు. నగరంలోని అన్ని ప్రధాన కూడళ్లలో నూతన సిగ్నల్ విధానం, సీసీ కెమెరాలు అమరుస్తామని... రోడ్డు ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. దీనికి నగరపాలక సంస్థ, రవాణాశాఖ అధికారుల సహకారం ఎంతో అవసరమన్నారు. ట్రాఫిక్ వ్యవస్థను మరింత ముందుకు తీసుకెళ్తామని... ప్రజలు కూడా సహకరించాలని కోరారు. నగరంలో బైక్ రేసులు నడిపే యువతను గుర్తించి వారికి వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహిస్తామని డీఎస్పీ తెలిపారు.
ఇదీ చూడండి: కొండచరియల కింద మనిషి - కాపాడిన శునకం