ముమ్మిడివరం నియోజకవర్గం సమీపంలో ఉన్న యానాంలోకి… తూర్పుగోదావరి జిల్లాలోని ఇతర ప్రాంతాల ప్రజలు తగిన ఆధారాలతో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు రావాలని అక్కడి అధికారులు స్పష్టం చేశారు. యానాంలో నివాసం ఉంటూ జిల్లాలో ఇతర ప్రాంతాల్లో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు చేసేవారు తమ గుర్తింపు కార్డులను చెక్ పోస్ట్ సిబ్బందికి చూపి ఏ ప్రాంతానికి వెళ్లేది తెలపాలని చెప్పారు. రెడ్‌జోన్ ప్రాంతాల్లో విధులు నిర్వర్తించే వారు కోవిడ్-19 పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలన్నారు. మధ్యాహ్నం రెండు తర్వాత ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రికి వెళ్లే వారికి తప్ప ఇతరులకు అనుమతి లేదన్నారు తేల్చిచెప్పారు.
- వ్యాపార సమయాలు ఇవే…
వారాంతపు సంతలు రెండు నెలల పాటు నిలిపేశారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కూరగాయలు, ఇతర నిత్యావసర సరకుల దుకాణాలతో పాటు అన్ని రకాల వ్యాపారాలకు అనుమతి ఇచ్చారు. సాయంత్రం 6 వరకు పాల వ్యాపారులు, రాత్రి 8 గంటల వరకు హోటల్ వ్యాపారులు ప్రజలకు అందుబాటులో ఉంటారని స్పష్టం చేశారు. రాత్రి 8 గంటల నుంచి తెల్లవారుజామున 6 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుందని… ఆ సమయంలో ప్రజలు ఎవరు రోడ్లపై తిరగొద్దని స్పష్టం చేశారు.
రానున్న మూడు నెలలు చాలా క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని, ప్రజలందరూ కరోనా నివారణకు సూచించిన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. నిబంధనలు అతిక్రమించినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మాస్కులు ధరించకుండా బయటకు వచ్చిన వారికి జరిమానా రూ.100 నుంచి 200కు పెంచినట్లు తెలిపారు.
ఇదీచదవండి: రెండు రంగుల్లో మనసుకు ఆహ్లాదానిస్తున్న గోదావరి జలాలు