సాధారణంగా ఒక కాన్పులో ఒక్కరు లేదా ఇద్దరు జన్మిస్తుంటారు. కానీ..తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలో ఓ మహిళ ఒకే కాన్పులో ముగ్గురు చిన్నారులకు జన్మనిచ్చింది. మండల పరిధిలోని కండ్రిగ గ్రామానికి చెందిన చిర్రా రమ్య.. పురిటి నొప్పులతో భాస్కర ఆసుపత్రిలో చేరింది.
పరీక్షించిన వైద్యులు...సాధారణ కాన్పు చేయటం కష్టమని శస్త్రచికిత్స చేయాలని సూచించారు. వైద్యబృందం ఆపరేషన్ చేయగా..ముగ్గురు ఆడపిల్లలు జన్మించారు. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. ఒకే కాన్పులో ముగ్గురు ఆడపల్లలు పుట్టటం పట్ల తల్లిందడ్రులు రమ్య, చిట్టిబాబులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.