ETV Bharat / state

కర్షకుడిపై ప్రకృతి కోపం... కష్టమంతా జలార్పణం

author img

By

Published : Sep 27, 2020, 9:52 PM IST

ప్రకృతి విపత్తులు రైతుల వెన్ను విరిచాయి. అప్పులు చేసి పెట్టి పెట్టుబడి, రేయింబవళ్ల శ్రమ తుడిచిపెట్టుకు పోయింది. తూర్పు గోదావరి జిల్లాలో గత నెలలో గోదావరి భీకర వరదలు, ఇప్పుడు ఏలేరు వరదలు... ఆపై వర్షాలు కర్షకులకు తీవ్ర నష్టాల్నే మిగిల్చాయి. ఆశల పంట నీటి పాలవటంతో అన్నదాతల దుస్థితి దయనీయంగా మారింది. జిల్లాలో వ్యవసాయ, ఉద్యాన పంటల తీవ్ర నష్టంపై ప్రత్యేక కథనం.

farmers problems
farmers problems

తూర్పుగోదావరి జిల్లాలో వర్షాలు, వరదలు కృషీవలుడికి తీవ్ర సష్టాన్నే మిగిల్చాయి. ఎగువన కురిసిన వర్షాలకు ఏలేరు జలాశయం నిండుకుండలా మారింది. సుమారు 24 టీఎంసీల సామర్థ్యం ఉన్న జలాశయం పూర్తిగా నిండిపోవటంతో 15 రోజులుగా 15వేల క్యూసెక్కుల వరకూ నీటిని విడుదల చేస్తున్నారు. దీనివల్ల ఏలేశ్వరం, కిర్లంపూడి, గొల్లప్రోలు, పిఠాపురం మండలాల్లో వందలాది ఎకరాలు నీట మునిగాయి. ఒక్కసారిగా పెద్ద మొత్తంలో నీరు వదలటంతో వందలాది ఎకరాల్లో వరి పంట పూర్తిగా కుళ్లి పోయింది.

ఆశలకు 'గండి'

పెద్దాపురం మండలం కాండ్రకోట వద్ద ఏలేరు కాల్వకు కొన్ని రోజుల క్రితం గండి పడింది. దీనివల్ల మండలంలోని వందల ఎకరాలు నీట మునిగాయి. అలాగే ఏలేరు కాల్వను ఆనుకుని ఉన్న సుమారు 20కి పైగా ప్రాంతాల్లో గండి పడి పంట పొలాల్ని ముంచేశాయి. వరి, పత్తి, ఉద్యాన పంటలు కూడా దెబ్బతిన్నాయి. ఇప్పటికే ఎకరానికి 15 వేల నుంచి 20వేల వరకూ పెట్టుబడి పెట్టటంతో రైతులు లబోదిబోమంటున్నారు. నీట మునిగిన పంటలు పూర్తిగా కుళ్లిపోయాయి. కాల్వలు పూడిక తీయకుండా వదిలేయడం వల్ల మరిన్ని ఇబ్బందులకు గురవుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత నష్టం జరిగినా ఇప్పటివరకూ అధికారులు, నాయకులు తమను పట్టించుకోలేదని తెలిపారు.

కోనసీమకు కన్నీరు

ఈ ఏడాది ఆగస్టు నెలలో వచ్చిన గోదావరి భీకర వరదలతో తీర ప్రాంతంలో పంటలన్నీ నీటి పాలయ్యాయి. 27 మండలాలు ప్రభావితమయ్యాయి. వరి, పత్తి, మొక్కజొన్న పంటలు 5 వేల హెక్టార్లలో దెబ్బతిన్నాయి. అరటి, బొప్పాయి, కూరగాయలు, తమలపాకులు, పసుపు, పూలు, నర్సరీలు తదితర ఉద్యాన వన పంటలకూ సుమారు 5 వేల హెక్టార్లలో నష్టం వాటిల్లింది. కోనసీమలోని తీర ప్రాంతంతోపాటు లంక గ్రామాల రైతులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వరదల అనంతరం కురిసిన భారీ వర్షాలకు ఈ ప్రాంతంలో వరి చేలు కూడా ముంపు బారిన పడ్డాయి. అలాగే ఎటపాక, కూనవరం, వీఆర్ పురం, చింతూరు, దేవీపట్నం, సీతానగరం, ఆలమూరు, కపిళేశ్వరపురం, రామచంద్రపురం తదితర మండలాల్లోనూ వరదలు, వర్షాలు రైతన్నలకు కష్టాల కడగండ్లే మిగిల్చాయి.

నీటిపాలైన శ్రమ

వరదల కారణంగా జిల్లాలో 20,738 మంది రైతులు నష్టపోయారు. ఇక భారీ వర్షాలకు అయితే 7,861 మంది రైతులు దెబ్బతిన్నారు. జిల్లాలో వరదలు, వర్షాల కారణంగా ఉద్యాన, వ్యవసాయ పంటలకు మొత్తం 119.26 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లినట్లు అధికారుల అంచనా. సుమారు 23వేల ఎకరాల విస్తీర్ణంలో ఉద్యాన పంటలు, వ్యవసాయ పంటలు దెబ్బతిన్నాయి. నీరు లాగిన పొలాల్లో సస్య రక్షణ చర్యలు చేపట్టి పంటను కొంత మేరకైనా రక్షించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

సాయం శూన్యం

తూర్పు గోదావరి జిల్లాలో ఏటా వరదలు, వర్షాలతో కర్షకులకు వందల కోట్ల రూపాయల పంట నష్టం వాటిల్లుతోంది. అయినా బాధిత రైతులకు పరిహారం మాత్రం దక్కడం లేదు. ఈ ఏడాదైనా ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని కష్టజీవి కోరుతున్నాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.