వారంతా ఒక ముఠా. కారును అద్దెకు తీసుకొని జాతీయ రహదారులపై ప్రయాణికులను గమ్య స్థానాలకు చేర్చుతామని నమ్మబలికి కారులో ఎక్కించుకుంటారు. వారు నమ్మి కారు ఎక్కారా... ఇక అంతే... నిర్జన ప్రదేశం రాగానే మారణాయుధాలతో బెదిరించి దోపిడీ చేసి అక్కడ నుంచి పరారవుతారు. వరుస కేసులు నమోదు కావడంపై అప్రమత్తమైన తూర్పుగోదావరి పోలీసులు నిఘా పెట్టి ముఠా సభ్యులను కటాకటాల్లోకి నెట్టారు.
నమ్మించి మోసం చేస్తారు
నిందితులు పశ్చిమగోదావరిలో కారును అద్దెకు తీసుకుని రాజమహేంద్రవరంలోని కంబాల చెరువు నుంచి విశాఖపట్నం బస్టాండ్ చేరుస్తామంటూ ప్రయాణికులను కారు ఎక్కించుకునేవారని ఎస్పీ నయీంఅస్మీ తెలిపారు. మార్గమధ్యంలో నిర్జన ప్రదేశానికి రాగానే ప్రయాణికులపై దాడి చేసి నగదు దోచుకునేవారని వెల్లడించారు. ఈ రకమైన దొంగతనాలపై తూర్పుగోదావరిలో కేసు నమోదు కావటంతో నిఘా పెట్టి.. ఆరుగురిని పట్టుకున్నామని ఎస్పీ వివరించారు. నిందితుల్లో ఒక బాలుడు ఉన్నట్లు తెలిపారు. వీరి వద్ద నుంచి రెండు కార్లు, రెండు సెల్‌ఫోన్లు, మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: