ETV Bharat / state

దొంగతనాలకు పాల్పడిన వ్యక్తి అరెస్ట్: 3 లక్షలు స్వాధీనం - రాయవరంలో దొంగ అరెస్ట్ వార్తలు

వరుస దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని తూర్పుగోదావరి జిల్లా రాయవరం పోలీసులు అరెస్ట్ చేశారు. అతని నుంచి 3 లక్షలకు పైగా నగదు, 8 బైక్​లు స్వాధీనం చేసుకున్నారు.

thief arrested by raayavaram police in east godavari district
దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్
author img

By

Published : Apr 20, 2020, 8:28 PM IST

తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం డివిజన్ పరిధిలోని పలు మండలాల్లో దొంగతనాలకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. రాయవరం ఎస్ ఐ. శ్రీనివాస్ నాయక్ తమ సిబ్బందితో చాకచక్యంగా వ్యవహరించి అతడిని పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కె. గంగవరం మండలం తామరపల్లికి చెందిన శ్రీను ఇప్పటివరకు పలు దొంగతనాలకు పాల్పడ్డాడు. అతని నుంచి రూ. 3 లక్షల 26 వేల నగదు, 8 మోటార్ సైకిళ్లు, 3 గ్యాస్ సిలిండర్లు, 6 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఇతనిపై గతంలో కేసులు ఉన్నట్లు తెలిపారు. నిందితుడ్ని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులను అనపర్తి సీఐ భాస్కరరావు అభినందించారు.

ఇవీ చదవండి.. 'అన్న క్యాంటీన్లు, ఆర్టీజీఎస్ ఉంటే ఎంతో ఉపయోగపడేవి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.