ETV Bharat / state

RRR movie: ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ.. థియేటర్‌ వద్ద గన్‌తో యువకుడు హల్‌చల్‌ - ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ థియేటర్‌ వద్ద గన్‌తో యువకుడు హల్‌చల్‌

RRR movie: తూర్పుగోదావరి జిల్లాలోని ఆర్ఆర్​ఆర్ సినిమా థియేటర్‌ వద్ద గన్‌తో యువకుడు హల్‌చల్‌ చేశాడు. తెర ముందు కేరింతలు కొట్టడంతో... ప్రేక్షకులు ఆందోళనకు గురయ్యారు. అప్రమత్తమైన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

young man hulchal with a gun
young man hulchal with a gun
author img

By

Published : Mar 25, 2022, 4:16 PM IST

RRR movie: తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలోని అన్నపూర్ణా థియేటర్‌ వద్ద ఓ యువకుడు తుపాకితో హల్‌చల్‌ చేశాడు. గన్‌తో ఫొటోలకు ఫోజులిస్తూ స్థానికులను భయాందోళనలకు గురి చేశాడు. థియేటర్‌లో ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా ప్రదర్శితమవుతుండగా.. ఆ యువకుడు తెర ముందు గన్‌తో కేరింతలు కొడుతూ అటూ ఇటూ తిరిగాడు. అతడి తీరుతో ప్రేక్షకులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అనంతరం యువకుడు థియేటర్‌ బయట గన్‌తో తిరుగుతుండగా పోలీసులు గమనించి అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద ఉన్న తుపాకిని స్వాధీనం చేసుకొని విచారణ చేపట్టారు. విచారణలో అది డమ్మీ తుపాకిగా తేల్చారు.

ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ.. థియేటర్‌ వద్ద గన్‌తో యువకుడు హల్‌చల్‌

ఇదీ చదవండి : RRR Movie: థియేటర్లలో ఆర్‌ఆర్‌ఆర్ సందడి.. అభిమానుల హంగామా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.