ETV Bharat / state

పాఠశాల విద్యా కమిటీ ఎన్నికల్లో ఘర్షణలు..పలుచోట్ల మళ్లీ వాయిదా - వైసీపీ పార్టీ

రాష్ట్రవ్యాప్తంగా వాయిదా పడిన విద్యా కమిటీ ఎన్నికలు ఇవాళ జరగగా పలుచోట్ల గొడవలు జరిగాయి. వైకాపా, తెలుగుదేశం పరస్పరం దాడులతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. కొన్నిచోట్ల ఎన్నికలను మళ్లీ వాయిదా వేశారు.

తూర్పుగోదావరి జిల్లా
తూర్పుగోదావరి జిల్లా
author img

By

Published : Oct 6, 2021, 7:39 PM IST

తూ.గో.జిల్లా తిరుమాలిలో హింసాత్మకంగా పాఠశాల విద్యాకమిటీ ఎన్నికలు

పాఠశాల విద్యాకమిటీ ఎన్నికలు కొన్నిచోట్ల రణరంగాన్ని తలపించాయి. గతనెలలో వాయిదా పడిన ప్రాంతాల్లో ఎన్నికలు నిర్వహించగా.. పలుచోట్ల వైకాపా, తెలుగుదేశం పరస్పరం దాడులతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. కొన్నిచోట్ల ఎన్నికలను మళ్లీ వాయిదా వేశారు.

సెప్టెంబర్‌ 22న రాష్ట్రవ్యాప్తంగా పాఠశాల విద్యా కమిటీ ఎన్నికలు నిర్వహించగా.. పలు కారణాలతో చాలా చోట్ల వాయిదా పడ్డాయి. వాయిదా పడినచోట్ల ఇవాళ ఎన్నికలు జరగ్గా.. చాలాచోట్ల వైకాపా, తెలుగుదేశం వర్గాలుగా విడిపోయి పరస్పరం రాళ్లు, కర్రలతో కొట్టుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ పరిధిలోని ఏలేశ్వరం మండలం తిరుమాలిలో.. పాఠశాల విద్యాకమిటీ ఎన్నికలు హింసాత్మకంగా మారాయి. వైకాపా, తెలుగుదేశం వర్గాల మధ్య తీవ్రస్థాయి ఘర్షణ జరిగింది. పరస్పరం రాళ్ల దాడులు చేసుకున్నారు. వైకాపా శ్రేణులు పోలీసులు, ఉపాధ్యాయులపైనా రాళ్లు రువ్వారు. ఈ దాడిలో ఓ కానిస్టేబుల్, మరో మహిళా ఉద్యోగికి గాయాలయ్యాయి. కొందరు గ్రామస్థులు కూడా గాయపడ్డారు. గతనెల 22న విద్యా కమిటీ ఎన్నికలోనూ ఘర్షణలు జరగ్గా అప్పుడు వాయిదా వేశారు. ఇవాళ మరోసారి నిర్వహిస్తున్న సమయంలోనూ అదే పరిస్థితి నెలకొంది.

విద్యాకమిటీ ఎన్నికల సందర్భంగా జరిగిన దాడులు, ప్రతిదాడులతో.. తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం చింతలూరు, శరభవరం గ్రామాలు దద్దరిల్లాయి. వైకాపా, తెలుగుదేశం వర్గాలకు చెందినవారు రెండు వర్గాలుగా మోహరించి.. పోలీసుల సమక్షంలోనే దాడి చేసుకున్నారు. రాళ్ల దాడి నుండి తప్పించుకొని పోలీసులు కూడా గోడ పక్కన దాక్కున్నారు. గ్రామాల్లో ఆధిపత్యం కో సం అధికార పక్షం దాడులకు దిగిందని తెలుగుదేశం వర్గీయులు ఆరోపించారు.

అనంతపురం జిల్లా కూడేరు మండలం అరవకూరు జిల్లా పరిషత్‌ పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. పోలీసులు, ఉపాధ్యాయులు కుమ్మక్కై అధికార వైకాపా వర్గానికి చెందిన వారికి దౌర్జన్యంగా ఛైర్మన్‌ పదవి కట్టబెట్టారని ఆరోపించారు. విలువలు లేని పాఠశాలలో పిల్లల్ని చదివించలేమని టీసీలు(T.C.) ఇచ్చేయాలని డిమాండ్‌ చేశారు.

ఇదీ చదవండి: KUNA RAVIKUMAR: 'ఈ నెల 8న కమిటీ ముందు హాజరై వివరణ ఇస్తా'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.