తూర్పు గోదావరి జిల్లా అమలాపురం డివిజన్ పరిధిలో 2 వేల మందికి కొవాగ్జిన్, కోవిషీల్డ్ టీకా రెండో డోసు వేసినట్లు అడిషనల్ డీఎంహెచ్వో డాక్టర్ సీహెచ్ పుష్కర రావు వెల్లడించారు. కొవాగ్జిన్, కోవిషీల్డ్ కలిపి డివిజన్ వ్యాప్తంగా ఇంతవరకు 1.30 లక్షల మందికి టీకాలు వేసినట్టు చెప్పారు.
వీరిలో మొదటి డోసు టీకా వేయించుకున్న వారు 90 వేలు, రెండో డోసు పూర్తయిన వారు 40 వేల మంది ఉన్నారన్నారు. డివిజన్లో ఇంకా అసలు టీకాలు పొందని వారు సుమారు 13 లక్షల మంది వరకు ఉంటారని ఆయన అంచనా వేశారు.
ఇదీ చదవండి: