గత పది రోజులుగా కురుస్తున్న వర్షాలు తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం మన్యంలో తగ్గుముఖం పట్టాయి. కొండలు దట్టమైన మేఘాలు కమ్ముకుని చూపరులను ఆకట్టుకుంటున్నాయి. శనివారం తెల్లవారుజామున ఈ దృశ్యాలు కనువిందు చేశాయి.
దిగువకు నీరు విడుదల..
తూర్పు గోదావరి జిల్లా మన్యంలో గత పది రోజులుగా కురిసిన వర్షాలు ప్రస్తుతం తగ్గినా... భూపతిపాలెం, ముసురుమిల్లి, సూరంపాలెం, మద్దిగెడ్డ జలాశయాల్లోకి వరద నీరు చేరుతూనే ఉంది. దీంతో జలాశయాలు నిండు కుండల్లా మారాయి. దిగువ ఉన్న కొండ కాలువలకు జలాశయాలు నుంచి నీటిని వదులుతున్నారు. భూపతిపాలెం జలాశయం నుంచి గత 8 రోజులుగా రెండు గేట్లు ఎత్తి 1,500 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.
ఇవీ చదవండి: