తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థాన ధర్మకర్తల మండలి సమావేశంలో పలు అభివృద్ధి పనులకు ఆమోదం తెలిపారు. కిర్లంపూడిలోని శ్రీ సత్యదేవ కల్యాణ మండపం వద్ద రూ. 38 లక్షలతో సత్యనారాయణ స్వామి ఆలయాన్ని నిర్మించడానికి,దేవస్థాన ధర్మకర్తల మండలి
ఆమోదం తెలిపింది. చైర్మన్ ఐ.వి.రోహిత్,ఈవో త్రినాథరావు లు అధికారులు చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే, దత్తత దేవాలయం కోరుకొండ లక్ష్మి నర్సింహస్వామి ఆలయంలో అభివృద్ధి పనులను చేపట్టేందుకు నిర్ణయించారు.
ఇదీచూడండి.ఒంగోలు గిత్తలకు.. ఘనంగా ''పదవీ విరమణ''