తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం నియోజకవర్గంలోని పుల్లేటికుర్రు గ్రామానికి చెందిన పది నెలల చిన్నారికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వారం రోజుల క్రితం ఈ గ్రామంలో ఇదే కుటుంబానికి చెందిన ఐదుగురికి వైరస్ సోకింది. చిన్నారికి పాజిటివ్ రావడంపై గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో అధికారులు అప్రమత్తమై.. గ్రామంలో పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని.. బయటకు వచ్చేటప్పుడు మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించాలని సూచిస్తున్నారు.
ఇదీ చదవండి..