ETV Bharat / state

WORKERS PROBLEM IN GULF: సమస్యలు చెప్తే కొడుతున్నారు..బహ్రెయిన్‌లోని తెలుగు కార్మికుల వీడియో - ఉపాధి కోసం​ వెళ్లిన కార్మికుల వేధిస్తున్న వేధిస్తున్న గల్ఫ్ దేశాలు

బహ్రెయిన్‌లో తెలుగు కార్మికుల కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. అక్కడి ఎన్‌ఎస్‌హెచ్‌ సంస్థలో ఇటీవలే చేరిన కార్మికులు.. ప్లాంట్ల నుంచి వచ్చే గాలులకు ఒక్కొకరుగా మరణిస్తున్నారు. యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Telugu workers in the Gulf
గల్ఫ్​లో తెలుగు కార్మికుల అవస్థలు
author img

By

Published : Sep 12, 2021, 6:36 AM IST

Updated : Sep 12, 2021, 12:44 PM IST

ఉపాధి కోసం గల్ఫ్‌ బాట పట్టిన తెలుగు కార్మికులకు.. బహ్రెయిన్‌లో ఇక్కట్లు తప్పడం లేదు. ఎన్‌ఎస్‌హెచ్‌ సహజవాయువు, చమురు సంస్థలో నెల రోజుల క్రితం చేరామని.. చుట్టూ ప్లాంట్ల నుంచి వచ్చే గాలులకు ఒక్కొకరు చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యాజమాన్యానికి చెప్తే పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు. కార్మికులను అక్కడి సిబ్బంది చేత కొట్టిస్తున్నారని.. ఒకరి గొంతు నుంచి రక్తం కారుతున్న దృశ్యాలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు.

బహ్రెయిన్‌లో తెలుగు కార్మికుల కష్టాలు

ఆరువేల మంది ఉపాధి కోసం ఇక్కడికి వచ్చాం. నెల రోజులు అంతా బాగానే గడిచింది. రానురాను ఊపిరి పీల్చుకోవటం సమస్యగా మారింది. చుట్టూ పరిశ్రమలే ఉన్న కారణంగా అధిక మెుత్తంలో విషవాయువులను విడుదల చేస్తున్నాయి. ఈ కాలుష్య వాయువు కారణంగా ఇప్పటికే 35 మంది మరణించారు. ఆ శవాలు నేటి వరకు ఇంటి చేరలేదని.. వారి బంధువులు చెబుతున్నారు. సంస్థ అధికారులను అడిగితే స్పందించటం లేదు. మమ్మల్ని కొడుతూ.. బలవంతంగా పని చేయిస్తున్నారు. ఇండియన్​ ఎంబసీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. -బాధితుడు

ప్రాంతాలతో సంబంధం లేకుండా.. ఇక్కడి వలస కార్మికులందరమూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. తిండి, పని సమయాలతో పాటు.. పని చేసే ప్రాంతాన్ని మార్చాలని కోరుతున్నాం. అధికారులు స్పందించటం లేదు. తిరిగి స్వదేశం వెళ్లిపోవాలని ప్రయత్నిస్తున్నాం. కానీ వెళ్లనివ్వటం లేదు. -బాధితుడు

ఇదీ చదవండి..

VIDEO VIRAL: భూమి ఆక్రమించారని ఓ కుటుంబం ఆవేదన.. చివరకు ఏమైందంటే..!

Last Updated : Sep 12, 2021, 12:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.