రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులు, హత్యాచారాలు, ఆకృత్యాలకు సంబంధించి బుధవారం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత తెలిపారు. 17 నెలల వైకాపా పాలనలో స్త్రీలపై జరుగుతున్న నేరాలు, ఘోరాలు సహా ఇతర దాష్టీకాలపై సమావేశంలో చర్చ చేపట్టనున్నట్లు అనిత పేర్కొన్నారు.
విద్యార్థిని, మహిళా సంఘాల సమక్షంలో..
మేధావులు, న్యాయవాదులు, విశ్రాంత పోలీస్ అధికారులు, విద్యార్ధిని సంఘాలు, మహిళా సంఘాల నేతలు, డ్వాక్రా సంఘం సభ్యులు సమావేశంలో పాల్గొంటారని ఆమె వివరించారు. మహిళల రక్షణపై తీసుకోవాల్సిన చర్యలపై చర్చించి తదనంతరం భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని స్పష్టం చేశారు.