తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో బాలిక అత్యాచారం ఘటనపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు నిజనిర్దరణ కమిటీ ఏర్పాటు చేశారు. కమిటీ సభ్యులుగా తెదేపా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత, రాజమండ్రి పార్లమెంట్ అధ్యక్షులు కె.ఎస్. జవహర్, కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, అమలాపురం పార్లమెంట్ అధ్యక్షులు రెడ్డి అనంత కుమారి, రాజమండ్రి పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు మాలే విజయలక్ష్మి, కాకినాడ పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు సుంకర పావని, అమలాపురం పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు పిచ్చేట్టి విజయలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మరియు స్థానిక మహిళా నాయకులను నియమించారు. త్వరలో కమిటీ సభ్యులు బాధిత కుటుంబాన్ని కలిసి పరామర్శించనున్నారు.
ఇవీ చదవండి..