మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని డిమాండ్ చేస్తూ తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో తెలుగుదేశం నాయకులు నిరసన చేపట్టారు. వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలపై దాడులు పెరిగిపోయాయని ఆరోపించారు. అఘాయిత్యాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో అమలాపురం మాజీ ఎమ్మెల్యే అయితా బత్తుల ఆనందరావు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: ఈ నెల 18న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం