తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తూర్పుగోదావరి జిల్లా పర్యటనకు వచ్చారు. రాజమహేంద్రవరం విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో...అమలాపురంలోని ఆ పార్టీ నాయకుడు మెట్ల రమణబాబు కుమార్తె వివాహానికి హాజరయ్యేందుకు వెళ్తూ క్వారీ సెంటర్లో ఆగారు. ఆయనకు తెలుగుదేశం శ్రేణులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. క్వారీ సెంటర్లోని రైతుబజార్లో ఉల్లిపాయల కోసం బారులు తీరిన వినియోగదారులతో మాట్లాడారు. ఉల్లి ధరలు ఆకాశానికి అంటడం వల్ల ప్రభుత్వం ఇచ్చే కేజీ ఉల్లిపాయల కోసం క్యూ కట్టామని స్థానికులు చెప్పారు. కార్యకర్తలతో లోకేష్ కొంతసేపు ముచ్చటించి వారికి అభివాదం చేస్తూ అక్కడినుంచి అమలాపురం వెళ్లిపోయారు.
ఇదీ చూదవండీ:
రైతు బజార్‌కి వెళ్లిన నారాలోకేష్ - తూర్పూగోదావరి జిల్లాలో నారా లోకేష్ పర్యటన
తెదేపా నాయకుడు మెట్ల రమణబాబు కుమార్తె వివాహానికి హాజరయ్యేందుకు... ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తూర్పుగోదావరి జిల్లా అమలాపురానికి వచ్చారు. ఈ క్రమంలో జిల్లాలోని క్వారీ సెంటర్లో ఉల్లిపాయలు కోసం బారులు తీరిన వారితో కాసేపు ముచ్చటించారు. వారి సాదకబాధలను అడిగి తెలుసుకున్నారు.