పంచాయతీ కార్యాలయాల రంగులు మార్చడానికి 14వ ఆర్థిక సంఘం నిధులు ఎలా మళ్లిస్తారని తెదేపా సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రశ్నించారు. కోర్టుల నుంచి వ్యతిరేక తీర్పులు వచ్చాక, ఇప్పుడు హడావుడిగా రంగులు మార్చేందుకు వైకాపా ప్రభుత్వం ముందుకు కదిలిందని విమర్శించారు. రంగులు మార్చడానికి కేంద్రం ఇచ్చిన నిధులను ఎలా వినియోగిస్తారన్నారు. వైకాపా నేతల సొంత డబ్బులతో రంగులు మార్చాలని బుచ్చయ్య చౌదరి రాజమహేంద్రవరంలో డిమాండ్ చేశారు. ఇళ్ల స్థలాలకు భూసేకరణ, మట్టి పూడ్చడం వంటి పనులతో వైకాపా నేతలు కోట్లు దోచుకుంటున్నారని ఆయన ఆరోపించారు.
రాజమహేంద్రవరం వెలుగుబందలోని ఆర్య వైశ్య సదన్ భూములు దేవాదాయశాఖ మంత్రి ప్రమేయంతోనే విక్రయించారు. ధర్మకర్తల మెరక భూమికి ఎకరా రూ.45 లక్షలు మాత్రమే చెల్లించారు. అదే సర్వే నెంబర్లో ముంపు భూమికి ఎకరా రూ.62 లక్షలు చెల్లించారు. ఈ వ్యవహారంలో దేవాదాయశాఖ మంత్రి ప్రమేయం ఉంది. మంత్రి వెల్లంపల్లిపై విచారణ జరిపించాలి -గోరంట్ల బుచ్చయ్య చౌదరి, తెదేపా నేత
ఇదీ చదవండి : పాస్ చేస్తారా.. పరీక్ష పెడతారా..?