రాష్ట్రంలో తెదేపా కార్యాలయాలు(attack on tdp offices), నేతల ఇళ్లపై వైకాపా(ycp) దాడులను ఖండిస్తూ.. ఆ పార్టీ అధినేత చంద్రబాబు(tdp chief chandrababu) నేడు రాష్ట్ర బంద్(ap bandh)కు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా.. తూర్పుగోదావరి (east godavari) జిల్లాలో ఆందోళనకు సిద్ధమైన తెదేపా నేతలను.. పోలీసులు ముందస్తుగా గృహనిర్బంధం చేశారు.
అమలాపురం, రామవరంలో..
అమలాపురం మాజీ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావును పోలీసులు గృహనిర్బంధం చేశారు. రామవరంలో అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణా రెడ్డిని సైతం గృహ నిర్బంధం చేశారు. ఆయన ఇంటిముందు బందోబస్తు నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. తెదేపా నాయకులు, కార్యకర్తలు బయటికి వెళ్లకుండా పోలీసులు ముందస్తు అరెస్టులు, గృహ నిర్భందాలు చేశారు. పలువురు నాయకులకు నోటీసులు సైతం జారీచేసి, ఆందోళనలు చేపట్టకుండా చర్యలు తీసుకున్నారు.
అమలాపురంలో మాజీ ఎమ్మెల్యే ఆనందరావు సహా పలువురు తెదేపా నాయకులను.. పోలీసులు గృహనిర్బంధం చేశారు. ఎలాంటి నోటీసులూ ఇవ్వకుండా గృహనిర్బంధం చేయడం రాజ్యాంగ విరుద్ధమని.. పోలీసులతో ఆయన వాగ్వాదానికి దిగారు. ఈ సమయంలో పోలీసులకు తెదేపా కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది.
ప్రత్తిపాడు, ఏలేశ్వరంలో..
ప్రత్తిపాడులో తెదేపా శ్రేణలు బంద్ నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఏలేశ్వరం మండలం ఎర్రవరం జాతీయ రహదారిపై పార్టీ శ్రేణులు మానవహారం నిర్వహించారు. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా.. పోలీసులు తెదేపా శ్రేణులతో మాట్లాడి అడ్డు తొలగించారు.
రావులపాలెంలో..
రావులపాలెంలోని 16వ నెంబర్ జాతీయ రహదారిపై.. అమలాపురం తెలుగు యువత అధ్యక్షుడు చిలుకూరి సతీష్ రాజు ఆధ్వర్యంలో.. బంద్ చేపట్టారు. జాతీయ రహదారిపై బైఠాయించి ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు అక్కడకు చేరుకుని పార్టీ కార్యకర్తలను, నాయకులను స్టేషన్‌కు తరలించారు. బంద్‌లో భాగంగా.. నిరసన తెలిపేందుకు రావులపాలెంలోని పార్టీ కార్యాలయం వద్దకు.. పార్టీ శ్రేణులు చేరుకోగా పోలీసులు వారిని అడ్డుకున్నారు.
ముమ్మిడివరంలో..
ముమ్మిడివరం నియోజకవర్గంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసనలు తెలిపారు. నియోజకవర్గంలోని తాళ్లరేవు, ఐ పోలవరం, ముమ్మిడివరం, కాట్రేనికోన మండలాల్లో వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేశారు. మాజీ ఎమ్మెల్యే దాట్ల బుచ్చి బాబు, ముమ్మిడివరం నగర పంచాయతీ మాజీ చైర్మన్ అశోక్ నాయకత్వంలో.. కార్యకర్తలంతా జాతీయ రహదారి 216 పై ఆందోళన చేపట్టారు. నిరసనలకు అనుమతి లేదంటూ.. వీరిని పోలీసులు స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఇదీ చదవండి: