తూర్పు గోదావరి జిల్లా అమలాపురం సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట తెదేపా నేతలు ధర్నా నిర్వహించారు. అన్నదాతలకు అందాల్సిన రబీ ధాన్యం సొమ్మును వెంటనే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. డబ్బు అందక సాగు చేయలేని పరిస్థితి ఏర్పడిందని అమలాపురం మాజీ శాసనసభ్యుడు అయితా బత్తుల ఆనంద రావు అన్నారు.
రైతులు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారని మాజీ ఎంపీ బుచ్చి మహేశ్వరరావు తెలిపారు. రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్న వైకాపా ప్రభుత్వం.. అన్నదాతల పట్ల నిర్లక్ష్యంతో వ్యవహరిస్తోందని రైతు సంఘ నాయకులు వాపోయారు. వారంతా వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సబ్‌కలెక్టర్ కార్యాలయంలో అందజేశారు.
ఇదీ చదవండి: