కరోనా నేపథ్యంలో లాక్డౌన్తో ఇబ్బంది పడుతున్న పేదలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ తూర్పుగోదావరి జిల్లా తునిలో తెదేపా నియోజకవర్గ ఇంఛార్జీ యనమల కృష్ణుడు ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టారు. తన ఇంటి వద్దే నిరసనకు ఉపక్రమించారు. పేదలకు రూ.5 వేలు ఇవ్వాలని.. అన్న క్యాంటీన్లు తెరవాలని, బీమా అమలు చేయాలని, కరోనా వ్యాప్తి నివారణకు కృషి చేస్తున్న వారికి రక్షణ సామగ్రి అందించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి..