ఇసుక కొరతపై ప్రభుత్వం వెంటనే స్పందించి అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప డిమాండ్ చేశారు. తూర్పుగోదావరిజిల్లా రాజానగరం మండలంలోని దివాన్ చెరువులో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన ఆయన... ఇసుక కొరత కారణంగా అనేక మంది కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ముఖ్యమంత్రి స్పందిచటంలేదని ఆరోపించారు. గోదావరిలోని చాలా రేవుల్లో ఇసుక లభ్యమవుతున్నా రాష్ట్ర ప్రజలకు అందడం లేదని... ఇతర రాష్ట్రాలకు తరలిపోతుందన్నారు. పేదలు ఇల్లు కట్టుకోవటానికి ఇసుక లేక నానా తిప్పలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి- 'వైకాపా నేతలు రాష్ట్రాన్ని ఆత్మహత్యల ప్రదేశ్‌గా మార్చారు'