తెదేపా జన చైతన్య యాత్రలో భాగంగా పలు జిల్లాల్లో ప్రస్తుత ప్రభుత్వ పాలనపై పలు విమర్శలు గుప్పించారు. కరపత్రాలను పంచుతూ వైకాపా వైఫల్యాలను ప్రజలకు తెలియపరిచారు. తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం నియోజకవర్గంలోని యాత్రలో... వైకాపా ప్రభుత్వం ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా పరిపాలన చేస్తోందని తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డొక్కా జగన్నాథం విమర్శించారు. 9 మాసాలు పాలనలో ప్రభుత్వం అన్నింటా వైఫల్యం చెందిందని.. రద్దులు చేయడం తప్పించి సాధించింది లేదని... ప్రత్తిపాడు నియోజకవర్గ బాధ్యులు వరుపుల రాజా అన్నారు.
అనంతపురం జిల్లా గుంతకల్లులోని యాత్ర నిర్వహించారు. నిరుపేదల పెన్షన్లను అనధికారికంగా తీసివేస్తున్నారని తెదేపా మాజీ ఎమ్మెల్యే జితేంద్రగౌడ్ మండిపడ్డారు. రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి నాశనం చేస్తున్నారని నెల్లూరు నగర మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్ అభిప్రాయపడ్డారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు యాత్రలో గుడేకల్ మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో జన యాత్ర చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ప్రభుత్వం విస్మరించి మోసం చేసిందని మాజీ ఎమ్మెల్యే బీవీ అన్నారు. రాజధాని పేరిట ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతుందని మండిపడ్డారు. సీఎంకి నిజంగా ప్రేమ ఉంటే కర్నూలును రాజధానిగా చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: రాజ్యసభ ఎన్నికలు: సీఎం జగన్ మదిలో ఉన్న ఆ నలుగురెవరు?