తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కలెక్టర్ కార్యాలయం ఎదుట రాష్ట్ర కౌలు రైతుల సంఘం నాయకులు ఆందోళన చేపట్టారు. తుపానుతో పంట నష్టపోయిన కౌలు రైతులకు వెంటనే నష్టపరిహారం అందించాలని కోరారు. రంగుమారిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని నినాదాలు చేశారు. నాలుగు నెలలుగా కష్టపడి పెంచిన పంటలు పాడై పెట్టుబడి నష్టపోతే సాయం భూయజమానులకు అందుతోందని ఆరోపించారు. సాగు చేస్తున్న వారికి ప్రభుత్వ సాయం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకూ పంట రుణాలు, ఇతర సంక్షేమ పథకాలు అందేలా చూడాలని కోరారు.
ఇదీ చదవండి: