తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో సంజీవని బస్సు ద్వారా వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహించారు. కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి పరీక్షలు ఏవిధంగా జరుగుతున్నాయో పరిశీలించారు. స్థానిక అధికారులు, వైద్య సిబ్బందికి ఎమ్మెల్యే పలు సూచనలు చేశారు. కరోనా వైరస్ సోకి ఇంటిలో చికిత్స పొందుతున్న వారి వద్దకు నిత్యం వైద్య సిబ్బంది వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవాలన్నారు.
ఇదీ చదవండి కోనసీమలో 114 గ్రామాలను చుట్టుముట్టిన కరోనా