కాకినాడలోని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు నివాసంలో... రాష్ట్ర వైకాపా ప్రధాన కార్యదర్శి పృధ్విరాజ్ మీడియాతో మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి కంటే... మంచి ముఖ్యమంత్రిగా జగన్మోహన్‌రెడ్డి పేరు తెచ్చుకుంటున్నారని కొనియాడారు. జగన్‌ను ముఖ్యమంత్రిగా పవన్‌కల్యాణ్ ఒప్పుకోను అనడమేంటని ప్రశ్నించారు. ప్రజలే ఆయనను 151 సీట్లతో సీఎం చేశారని పేర్కొన్నారు. దిశ ఘటనలో నిందితులను నడిరోడ్డుపై శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి..రాజమహేంద్రవరంలో ఈనాడు ''చదువు-కొలువు''