తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమలో రెండు రోజుల నుంచి ఎండలు మండిపోతున్నాయి. ప్రజలు ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్నారు. ఈనెల 6న ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం రెండు గంటలసేపు కురిసింది. వాతావరణం చల్లబడుతుందని అందరూ ఆశించేలోపే... మరుసటి రోజు నుంచి ఎండలు రోజురోజుకూ పెరుగుతూ వస్తున్నాయి. మరోపక్క విపరీతమైన ఉక్కబోతతో చిన్నారుల నుంచి వృద్ధుల వరకు అవస్థలు పడుతున్నారు. మధ్యాహ్న సమయంలో అందరూ ఇళ్లకే పరిమితం అవుతున్నారు. రహదారులన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి.
వరుణుడు కరుణించినా.. సూర్యుడు శాంతించలేదు
ఒక్కసారిగా వర్షం పలకరింపుతో వాతావరణం చల్లబడిందని అందరూ సంతోషించారు. కానీ ఇంతలోపే కోనసీమపై మళ్లీ సూర్యుడు ప్రతాపం చూపుతున్నాడు.