భారీ వర్షం కారణంగా కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం నీటమునిగింది. వాతావరణంలో మార్పుల కారణంగా కోనసీమలో శుక్రవారం సాయంత్రం ఎడతెరిపి లేని వర్షం కురిసింది. ఫలితంగా వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలోకి నీరు చేరింది. ఆలయ ప్రాంగణాలు పూర్తిగా మునిగిపోయాయి. స్వామివారి హుండీ చుట్టూ వర్షపు నీరు నిలిచింది.
![నీటమునిగిన కోనసీమ తిరుపతి శ్రీవారి ఆలయ ప్రాంగణం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8937542_konaseemaaa.png)