ఆలోచన వినూత్నం.. ఆవిష్కరణ అద్భుతం - తూర్పుగోదావరిలో విద్యార్థి నూతన ఆవిష్కరణ వార్తలు
వ్యవసాయం ఒక ఎత్తైతే.. పంటను కాపాడుకోవడం మరో ఎత్తు. కోతులు, పక్షులు పంటలను పాడు చేయడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతుంటారు. ఈ సమస్య పరిష్కారానికి తూర్పు గోదావరి జిల్లా తునికి చెందిన తిరుమలనేడి సాయి పూనుకున్నాడు. వినూత్నంగా ఆలోచించాడు. ఓ పరికరాన్ని తయారు చేసి ఆదర్శంగా నిలిచాడు. పంటలకు ఎప్పటికప్పుడు తగిన మోతాదులో నీరు అందించేలా ఇండికేటర్... విద్యుత్ కాంతితో పురుగుల్ని తరిమికొట్టేలా ఏర్పాట్ల వంటివన్నీ సోలార్‌తో పని చేసేలా పరికరాన్ని సిద్ధం చేశాడు. ఆ విశేషాలపై సాయితో ఈటీవీ భారత్ ముఖాముఖి.