ETV Bharat / state

జిల్లా వ్యాప్తంగా పక్కాగా అమలవుతున్న కర్ఫ్యూ

తూర్పుగోదావరి జిల్లాలో 5,564కు చేరిన కరోనా పాజిటివ్ కేసులతో రాష్ట్రంలోనే ఎక్కువ కేసులు ఉన్న జాబితాలో రెండో స్థానంలో ఉంది. అధికారులు అప్రమత్తమై ఈరోజు జిల్లా వ్యాప్తంగా పూర్తి లాక్ డౌన్ విధించారు. ఉదయం 6గంటల నుంచి రేపు ఉదయం 6గంటల వరకూ అత్యవసరాలు మినహా ఏ ఒక్క దుకాణం తెరవకూడదని, ప్రజలెవ్వరూ అనవసరంగా రోడ్లపైకి రావద్దని కలెక్టర్ ఆదేశాలు జారీచేశారు.

strictly implementing curfew in  east godavari

author img

By

Published : Jul 19, 2020, 2:36 PM IST

తూర్పుగోదావరి జిల్లాలో కలెక్టర్ కర్ఫ్యూ విధించటంతో కోనసీమలోని ప్రాంతాలన్నీ నిర్మానుష్యంగా మారాయి. కొత్తపేట నియోజకవర్గంలోని రావులపాలెం, ఆత్రేయపురం, ఆలమూరు, కొత్తపేట మండలాల్లో దుకాణాలు మూతపడ్డాయి. ప్రజలందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు.

కాకినాడ నగరంలో బానుగుడి, కల్పన, కోకిల, డిమార్ట్, సర్పవరం, బాలాజీ చెరువు, సంతచేరువు, జగన్నాధపురం తదితర ప్రాంతాల్లో... రహదారులు నిర్మానుష్యంగా మారాయి. ఏవరైనా రహదారులపై తిరుగుతుంటే పోలీస్ సిబ్బంది హెచ్చరించి పంపిస్తున్నారు.

కాకినాడ నగరం, గ్రామీణం బోసిపోయింది. జనసంచారం లేక రోడ్లన్నీ, దుకాణాలు వెలవెలబోయాయి. కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా ప్రతి ఒక్కరూ అధికారులు చెప్పిన విషయాన్ని అర్థం చేసుకోవాలని సూచించారు.

అనవసరంగా బయట తిరుగుతున్న వారిపై కేసు నమోదు చేస్తామని అమలాపురం డీఎస్పీ షేక్ బాషా హెచ్చరించారు. కేవలం వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించిన వాహనాలకు మాత్రమే అనుమతిస్తామన్నారు.

ప్రత్తిపాడు మండలంలోని ధర్మవరం గ్రామంలో మాంసం దుకాణాలు తెరవగా పోలీసులు మూయించారు. మెట్ట ప్రాంతంలోని ప్రత్తిపాడు, జగ్గంపేట, ఏలేశ్వరం, కిర్లంపూడి, మండలాల్లో కర్ఫ్యూ కట్టుదిట్టంగా అమలు చేశారు.

ఇదీ చూడండి

సీఎం జగన్​కు ఎంపీ రఘురామకృష్ణరాజు మరో లేఖ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.