మండుటెండలో కాళ్లు కాలుతున్నా లెక్క చేయకుండా పరుగులు పెడుతున్నారా చిన్నారులు... ఆకలి మంట ముందు కాళ్ల మంట ఏ మాత్రం ఎక్కువ కాదనుకుంటూ ఆహారం అందించే వాహనాల ఎక్కడ ఆగుతాయో తెలియక వాటి వెనుక పరుగులు తీస్తున్నారు.
దయనీయంగా ఉన్న ఈ దృశ్యాలు తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలోవి. రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబాల్లో పుట్టిన పిల్లలు వారు. రోజు కూలీపై బతికే వారికి లాక్డౌన్ వలన పనుల్లేక పస్తులుంటున్నారు. ఆకలికి తట్టుకోలేక ఆ చిన్నారులు ఇలా రోడ్లపైకి వచ్చి నిరీక్షిస్తున్నారు. దాతలు ఇచ్చే ఆహారంతోనే కడుపు నింపుకుంటున్నామనీ దీనంగా చెప్తున్నారీ చిన్నారులు.
ఇదీ చదవండి:ఉపాధి కోల్పోయిన వారికి కూరగాయలు పంపిణీ