ETV Bharat / state

'రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాలకు పక్కా భవనాలు' - తూర్పు గోదావరి జిల్లా అటవీ ప్రాంతంలో మంత్రి తానేటి వనిత పర్యటన వార్తలు

కుటుంబ సభ్యులతో తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరంలోని ఏజెన్సీ పర్యాటక ప్రాంతాల్లో రాష్ట్ర మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి తానేటి వనిత పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె శాఖలో అమలు చేయబోయే పలు అంశాలను ప్రస్తావించారు.

State Women and Child Welfare Minister Taneti Vanitha
రాష్ట్ర మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి తానేటి వనిత
author img

By

Published : Jan 17, 2021, 3:09 PM IST

రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాలకు పక్కా భవనాలు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. కుటుంబ సభ్యులతో తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరంలోని ఏజెన్సీ పర్యాటక ప్రాంతాలను తిలకించారు. ముందుగా సీతపల్లివాగు, రంప శివాలయం, భూపతిపాలెం జలాశయం ప్రాంతాలను చూశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

వైఎస్​ఆర్​ సంపూర్ణ పోషణ ద్వారా అంగన్వాడీ కేంద్రాల్లో పోషకాహారం అందిస్తున్నట్లు ఆమె తెలిపారు. తద్వారా మాతా శిశు మరణాలు తగ్గు ముఖం పడుతున్నట్లు స్పష్టం చేశారు. అనంతరం మారేడుమిల్లిలో పర్యాటక ప్రాంతాలను వీక్షించారు. అమె వెంట ఆర్డీవో శీనానాయక్, జిల్లా మహిళ శిశు సంక్షేమ శాఖ పీడీ పుష్పమణి, సీడీపీవో క్రాంతి కుమారి, సీఐ త్రినాధు తదితరులు ఉన్నారు.

ఇవీ చూడండి...

జై రామ్ చిత్ర షూటింగ్ ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.