ETV Bharat / state

నీటి సంరక్షణపై రాష్ట్రవ్యాప్తంగా అవగాహన ర్యాలీలు - east godavari district latest news

ప్రపంచ జల సంరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా అవగాహన ర్యాలీలు చేపట్టారు. నీటిని వృథా చేయకూడదని, భవిష్యత్ తరాలకు నీటి కష్టాలు రాకుండా చర్యలు తీసుకుంటామని ప్రతిజ్ఞ చేశారు.

state wide awareness rally for water  Conservation
నీటి సంరక్షణపై రాష్ట్రవ్యాప్తంగా అవగాహన ర్యాలీలు
author img

By

Published : Mar 22, 2021, 4:32 PM IST

విజయవాడలో...

వైకాపా విజయవాడ తూర్పు నియోజకవర్గ కార్యాలయంలో ప్రభుత్వ పాఠశాలలకు 120 లీటర్ల సామర్ధ్యం గల వాటర్ ఫిల్టర్లను దేవినేని నెహ్రూ ఛారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్, వైకాపా తూర్పు నియోజకవర్గ ఇన్​ఛార్జ్ దేవినేని అవినాష్ అందించారు. విద్యార్థుల కోసం సీఎం జగన్... నాడు-నేడు కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారని, ఈ కార్యక్రమంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతోందని చెప్పారు.

తూర్పుగోదావరి జిల్లా...

ప్రతి ఒక్కరూ నీటిని పొదుపుగా వినియోగించి, జల సంరక్షణలో భాగస్వాములు కావాలని తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం శాసనసభ్యుడు కొండేటి చిట్టిబాబు అన్నారు. అనంతరం స్థానిక చెరువుకు పూజలు చేసి, జల సంరక్షణకై ప్రజల కోసం ప్రతిజ్ఞ చేయించారు. కిర్లంపూడి మండలం జగపతినగరంలో మండలస్థాయి అధికారులతో, గ్రామ వాలంటీర్లతో జల సంరక్షణపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. నీటిని వృథా చేయకుండా రక్షించుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని స్థానిక ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు అన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే భవిష్యత్​లో పెట్రోల్, డీజిల్ ధరల కంటే ఎక్కువ ధరకు నీటిని కొనుక్కోవలసిన దుస్థితి వస్తుందని అన్నారు.

ప్రకాశం జిల్లా...

ప్రపంచ జల దినోత్సవాన్ని పురస్కరించుకొని వేటపాలెంలో 'క్యాచ్ ది రెయిన్' కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి నీటి బొట్టు ఎంతో విలువైందని, నీటిని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని అధికారులు అన్నారు. యర్రగొండపాలెంలో జల శక్తి అభియాన్ అధ్వర్యంలో అవగాహన ర్యాలీ చేపట్టారు. భవిష్యత్ తరానికి నీటి కష్టాలు రానీయకుండా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఇదీ చదవండి:

ఏప్రిల్ 1 నుంచి ఒంటిపూట బడులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.