ETV Bharat / state

అన్నవరం దేవస్థానంలో 50 మంది పారిశుద్థ్య కార్మికులు తొలగింపు

అన్నవరం దేవస్థానంలో 50 మంది పారిశుద్ధ్య కార్మికులను తొలగిస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. 50 మంది సిబ్బందిని తగ్గించి.. 150 మందిని మాత్రమే సరఫరా చేయాలని పద్మావతి సర్వీసెస్​కు సూచించారు. అన్నవరం దేవస్థానంలో పద్మావతి హాస్పిటాలిటీ ఫెసిలిటీ మేనేజ్​మెంట్​ సర్వీసెస్ ద్వారా పారిశుద్ధ్య నిర్వహణ చేస్తున్నారు.

author img

By

Published : Jul 3, 2020, 12:06 PM IST

temple
temple

తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థానంలో 50 మంది పారిశుద్ధ్య సిబ్బందిని తగ్గించాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు పారిశుద్ధ్య నిర్వహణ సంస్థకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

అన్నవరం దేవస్థానంలో పద్మావతి హాస్పిటాలిటీ ఫెసిలిటీ మేనేజ్​మెంట్​ సర్వీసెస్ ద్వారా పారిశుద్ధ్య నిర్వహణ చేస్తున్నారు. పరిపాలన సౌలభ్యం దృష్ట్యా జులై 1 నుంచి 50 మంది సిబ్బందిని తగ్గించి.. 150 మందిని మాత్రమే సరఫరా చేయాలని పద్మావతి సర్వీసెస్​కు అధికారులు ఆదేశాలు ఇచ్చారు.

కరోనా వ్యాప్తి చెందుతున్న క్రమంలో మార్చి 20 నుంచి స్వామి దర్శనానికి భక్తులను అనుమతించ లేదు. దీంతో ఏప్రిల్ 1 నుంచి పారిశుద్ధ్య పనులకు మెటీరియల్​పై 80 శాతం తగ్గించి 20 శాతం మాత్రమే చెల్లించే విధంగా చర్యలు తీసుకున్నారు. జూన్ 8 నుంచి స్వామి దర్శనానికి పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతిస్తున్నా.. కొండపై వసతి గదులను భక్తులకు కేటాయించడం లేదు. దీంతోపాటు పరిమిత సమయంలో మాత్రమే దర్శనాలకు అనుమతిస్తున్నారు. ఈ క్రమంలో పారిశుద్ధ్య నిర్వహణకు 50 మంది సిబ్బందిని తగ్గించాలని అధికారులు ఆదేశాలిచ్చారు. దీనికి అనుగుణంగానే జులై 1 నుంచి బిల్లులు చెల్లిస్తామని స్పష్టం చేశారు. మరోవైపు పారిశుద్ధ్య నిర్వహణకుగాను నూతనంగా పిలిచే టెండర్లలో సిబ్బందిని తగ్గించడానికి అధికారులు చర్యలు చేపడుతున్నారు.

ఇదీ చదవండి: ఒక్కరోజే 20 వేలకుపైగా కేసులు.. 379 మరణాలు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.