ETV Bharat / state

టికెట్ల పంచాయితీతో థియేటర్ల మూసివేత.. ఉపాధి కోల్పోతున్న సిబ్బంది

author img

By

Published : Dec 28, 2021, 4:43 AM IST

employment losing with theaters close : రాష్ట్రంలో సినిమా థియేటర్లను వాటి యజమానులు స్వచ్ఛందంగా మూసివేస్తుండటంతో వేల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. కొవిడ్‌ ప్రారంభం నుంచి థియేటర్ల తలుపులు మూసుకుపోవడంతో వీరికి ఉపాధి కరవైంది. వైరస్‌ ప్రభావం తగ్గి సినిమా హాళ్లు మళ్లీ కళకళలాడుతున్నాయనుకున్న తరుణంలో టికెట్ల ధరల తగ్గించారని.. థియేటర్లను నడపకూడదని యజమానులు నిర్ణయించినందున మళ్లీ వీధినపడుతున్నామని వారు వాపోతున్నారు.

theaters
theaters

employment losing with theaters close : సినిమా థియేటర్లను వాటి యజమానులు స్వచ్ఛందంగా మూసివేస్తుండటంతో వేల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. అత్తెసరు వేతనాలతో బతుకు బండి లాగుతున్న చిరుద్యోగుల బతుకు చిత్రం మరింత దుర్భరంగా మారుతోంది. కొవిడ్‌ ప్రారంభం నుంచి థియేటర్ల తలుపులు మూసుకుపోవడంతో వీరికి ఉపాధి కరవైంది. వైరస్‌ ప్రభావం తగ్గి సినిమా హాళ్లు మళ్లీ కళకళలాడుతున్నాయనుకున్న తరుణంలో టికెట్ల ధరల తగ్గించారని.. థియేటర్లను నడపకూడదని యజమానులు నిర్ణయించినందున మళ్లీ వీధినపడుతున్నామని వారు వాపోతున్నారు. కరోనా నేపథ్యంలో గత ఏడాది మార్చి నుంచి థియేటర్లలో చలనచిత్రాల ప్రదర్శన ఆగిపోయింది. రెండు నెలలుగా సినిమాల ప్రదర్శన పెరిగింది. ప్రధాన పండుగలు వచ్చే సమయంలో.. టికెట్‌ ధరల తగ్గింపుతో పలుచోట్ల యజమానులు థియేటర్లను తాత్కాలికంగా మూసేశారు. కొన్నిచోట్ల లోపాలు సరిదిద్దుకునేందుకు కొంత సమయం ఇవ్వగా... మరికొన్నిచోట్ల అధికారులే థియేటర్లను సీజ్‌ చేశారు. చిత్రాల ప్రదర్శన నిలిచిపోయిన సినిమా హాళ్లు రాష్ట్రంలో వందల్లో ఉన్నాయి. ప్రతి థియేటర్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా 50 మంది జీవనోపాధి పొందుతున్నారు. మేనేజర్‌, టికెట్‌ బుకింగ్‌ క్లర్కులు, ఆపరేటర్లు, గేట్‌మెన్లు ఇలా సుమారు 30 మంది పని చేస్తుంటారు. యజమానులు నెలకు రూ.9వేల నుంచి రూ.12వేల నుంచి వరకు వేతనాలను చెల్లిస్తున్నారు. అలాగే సినీ ప్రేక్షకుల కోసం థియేటర్ల వెలుపల తినుబండారాలు, కిళ్లీ కొట్లు, టీ స్టాళ్లు, హోటళ్లు నడిపే వారికి కొదవలేదు. థియేటర్ల మూసివేతతో తమ జీవనోపాధి ఎలా అని సిబ్బంది ప్రశ్నిస్తున్నారు. కొందరు సొంతూళ్లకు వెళ్లిపోగా, మరికొందరు కూలి పనులకు వెళ్తున్నారు. ‘కొవిడ్‌ కారణంగా సినిమా థియేటరు మూసివేయడంతో ఇంటి వద్దనే ఉన్నా. పరిస్థితులు చక్కబడుతున్నాయని అనుకుంటున్న తరుణంలో టికెట్ల ధరలు తగ్గించడంతో మళ్లీ థియేటర్‌ను మూసివేశారు. ప్రస్తుతం ఏం చేయాలో పాలుపోవడం లేదు. పని లేకపోవడంతో రోడ్డున పడ్డా’ అని కృష్ణాజిల్లా కంచికచర్లలో ఓ థియేటర్‌లో పనిచేసే చిరుద్యోగి ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఓ సినిమాహాల్‌లో వాల్‌ పోస్టర్లు అంటిస్తూ, మెయింటినెన్స్‌ పనులు చేయిస్తున్నా. ఇప్పుడిప్పుడే థియేటర్‌ గాడిన పడుతున్న దశలో తగ్గించిన టికెట్‌ ధరలు గిట్టుబాటు కావని యజమాన్యం మూసేసింది. దీంతో నాతోపాటు పనిచేస్తున్న 12 మంది ఇబ్బందులు పడుతున్నాం. మూడు రోజులుగా పనులు లేవు. గత రెండు నెలలుగా జీతాలు కూడా చెల్లించలేదు’ అని విశాఖ జిల్లా డి.అగ్రహారానికి చెందిన చొప్పా మహాలక్ష్మి చెప్పారు.

సినిమా ఆడితేనే దుకాణం నడిచేది

నల్లి ప్రకాష్‌

రాజోలు మండలం తాటిపాకలోని శ్రీనివాస థియేటర్‌ ఎదురుగా ఫాస్ట్‌పుడ్‌ దుకాణం నిర్వహిస్తున్నా. సినిమాలు ప్రదర్శిస్తే రోజుకు రూ.4వేల వరకు వ్యాపారం జరిగేది. చిత్రాల ప్రదర్శన ఆగినందున రూ.1,000 వ్యాపారం జరగడం కూడా కష్టమైపోతోంది.- నల్లి ప్రకాష్‌, రాజోలు మండలం, తూర్పుగోదావరి జిల్లా

ఆదాయం కోల్పోయా

తాడేల శ్రీనివాసరావు

మాశంకర్‌ థియేటర్‌లో క్యాంటీన్‌ నిర్వహిస్తున్నా. కరోనా కష్టాలను అధిగమించి ఇప్పుడిప్పుడే గాడిలో పడుతున్న తరుణంలో థియేటర్‌ మూసివేయడంతో ఇబ్బందులు పడుతున్నాం. -తాడేల శ్రీనివాసరావు, కొత్తూరు, శ్రీకాకుళం జిల్లా

ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా..

సినిమాహాల్‌లో మేనేజర్‌గా పని చేస్తున్నా. కరోనా నేపథ్యంలో ఇటీవల వరకూ థియేటర్‌ను మూసేయడంతో ఉపాధి లేక ఇబ్బందులు ఎదుర్కొన్నా. మళ్లీ థియేటర్లు నడుస్తుండటంతో హమ్మయ్య గాడిన పడుతున్నామని ఊపిరి పీల్చుకున్నా.. కానీ అంతలోనే మూతబడ్డాయి.- రామకృష్ణ, ద్రాక్షారామం, తూర్పుగోదావరి

పనికి రావొద్దని చెప్పారు

అప్పారావు

నేను, నా భార్య శ్రీవెంకటేశ్వర థియేటర్‌లో స్వీపర్లుగా పని చేస్తున్నాం. కరోనా కాలంలో థియేటర్‌ మూసివేయడంతో ఉపాధి లేక వీధినపడ్డాం. రెండు నెలల కిందట థియేటర్‌ను మళ్లీ తెరవడంతో పని దొరికిందని ఆనందపడ్డాం. ఇప్పుడు మళ్లీ పనిలోకి రావద్దని చెప్పారు.- అప్పారావు, రావికమతం, విశాఖ జిల్లా

ఇదీ చదవండి

అపాయింట్​మెంట్​ ఇస్తే సీఎం జగన్​ను కలుస్తాం: నిర్మాత దిల్​రాజు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.